పయనించే సూర్యుడు వత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకటరావు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం ఏప్రిల్ 15 భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శ్రీ దారేల్లి చిరంజీవి గారి ఆధ్వర్యంలో, పార్టీ శ్రేణులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దళిత నాయకులు పిల్లలు పాల్గొన్నారు.
