వెలుగులో జరిగిన అవినీతి సొమ్మును రికవరీ చేయించండి. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కీ వినతి పత్రాన్ని అందజేశారు

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 16 చింతూరు మండలంలో వెలుగు ( ఇందిరా క్రాంతి పథకం) లో జరిగిన ఒక కోటి 30 లక్షలు రూపాయల అవినీతి సొమ్మును రికవరీ చేసి గ్రూప్ సభ్యులకు న్యాయం చేయాలని సిఐటియు.మహిళా సంఘం. గిరిజన సంఘంలా ఆధ్వర్యంలో చింతూరు ఐటిడిఏ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడినట్టువంటి వినతి పత్రానికి జిల్లా కలెక్టర్ కి అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు పోలవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్. గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్ మాట్లాడుతూ చింతూరు మండలంలో వెలుగు (ఇందిరా క్రాంతి పథకంలో ) 2017 -2018 సంవత్సకాలం నుండి 2020 వరకు గ్రూప్ సభ్యులకు ఇవ్వాల్సిన. లకు సంబంధించిన లోన్లు ఒక కోటి 30 లక్షలు రూపాయలు అప్పుడున్న సీసీలు.ఏటీఎంలో.ఏపీ డి. పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడ్డారు. దానితో అసలు అప్పులే తీసుకోని మండలంలోని 458 మంది సభ్యుల పేర్లతో అప్పులు వెలుగు లాగిన్ లో కనబడుతున్నాయి దీనితో ఆ సభ్యులకు గత పది సంవత్సరాలుగా కొత్త అప్పులు రావడం లేదు అని అన్నారు. వారి పేర్లుతో కనబడుతున్న అప్పులకు వడ్డీలు పెరుగుతూ సర్ఫ్ నుండు కట్టాలని ఒత్తిడి చేయడంతో అయోమయ స్థితిలో ఉన్నారు. దీనివలన 458 మంది సభ్యులు కొత్త అప్పులు రాక ఆర్థికంగా నష్టపోవడం మరియు అప్పులు కట్టాలని చెప్పడంతో మానసికంగా అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ఆ సమయంలో వెలుగు అధికారులు చేసిన అవినీతి వలన గ్రూప్ సభ్యులు తీవ్రo గా నష్టపోయారు కావున అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకొని అవినీతికి గురైన సొమ్మును రికవరీ చేసి గ్రూప్ సభ్యులకు న్యాయం చేయాలని అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ సభ్యుల సమస్యను 15 రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పోడియం లక్ష్మణ్. సిఐటియూ నాయకులు చింత రాంబాబు. పొడియం జానీ.బాధితులు. శ్రీదేవి. నాగమ్మ. శారద. దుర్గ. సుబ్బమ్మ. ముత్తమ్మ. చిన్నమ్మ. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *