బిజినపల్లి నూతన విద్యాధికారి తిరుపతయ్యకు ఘన సన్మానం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలంలో నూతన విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన టి. తిరుపతయ్యకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరపున హృదయపూర్వక సన్మానం నిర్వహించారు. లట్టుపల్లి జిహెచ్ఎం, ఎంఈఓగా ఫుల్ అడిషనల్ చార్జ్ స్వీకరించిన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షులు దెంది రాజా రెడ్డి, తపస్ మండల అధ్యక్షులు హరికృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ రెడ్డి తదితరులు తిరుపతయ్యను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు భాస్కర్ గౌడ్, రామకృష్ణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *