హనవాల్ గ్రామంలో జనసేన పార్టీ జెండా స్థాపనకు భూమి పూజ.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 ఆదోని రూరల్ రిపోర్టర్ ఆదోని మండలం హానవల్ గ్రామంలో జనసేన పార్టీ జెండా స్థాపనకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్పన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు యం పులి రాజు మాట్లాడుతూ, మల్లప్పన్న ప్రజల మనసులు గెలుచుకున్న నాయకుడిగా, ప్రతి కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తిని తెలిపారుగ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, యువతకు అవకాశాల కల్పనలో జనసేన పార్టీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. హానవల్ గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాము గౌస్, వలి భాష, గ్రామ నాయకులు నాగరాజ్, సావలి చిన్నప్ప, ఈషా మిద్దిన్, చిన్న, ముదుకప్ప, లక్ష్మన్న, గాదలింగప్ప, నరసప్ప, నాన్నవల్లి మస్తానప్ప, గోవిందు, బాబు, రమేష్, శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.అలాగే జనసేన పార్టీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పిఎస్ జయరాం మరియు నాగరాజు చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *