నాగులవంచ హాస్టల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఉన్న షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహం నాగులవంచలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు వసతి గృహ సంక్షేమ అధికారి కొత్త వెంకటేశ్వరరావు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వసతి గృహ విద్యార్థులకు అంబేద్కర్ గారి జీవిత విశేషాలు మరియు వారి నినాదం బోధించు, సమీకరించు, పోరాడ లని ప్రజలను చైతన్యవంతులను చేశారని తెలియజేశారు అదేవిధంగా ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలను ఉపయోగించుకొని ఉన్నత చదువులు ఉద్యోగాలు పదవులు సాధించి అంబేద్కర్ ఆశయాలు సాధించాలని కోరినారు. అదేవిధంగా మహనీయుల జయంతులను పురస్కరించుకొని వ్యాసరచన, వక్తృతపు పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసినారు ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి కొత్త వెంకటేశ్వరరావు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది వెంకటేశ్వర్లు, మహేందర్, దిలీప్, వినయ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *