పేదలకు పట్టెడన్నం పెట్టడమే కూటమి ధ్యేయం.

* రంపచోడవరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం. * రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్,ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఏప్రిల్.16.2026 పేదలకు కడుపు నిండా పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం బాధ్యతగా.ముందుకు సాగుతుందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు.రంపచోడవరంలో బుధవారం అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె అన్నా క్యాంటీన్ ను పోలవరం జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు ఐటిడిఏ పిఓ బచ్చు స్మరణ రాజ్ లతో కలిసి ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆలోచనే పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే నిజమైన స్వాతంత్రం అని ఆనాడే చెప్పారని పేర్కొన్నారు.దానికి అనుగుణంగా ఆయన ఆనాడు కిలో 2/-రూపాయలకు బియ్యం పథకం తీసుకువచ్చి పేదల పక్షపాతి అయ్యాడన్నారు.దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో 15 ఆగస్టు 2024 లో అన్నా క్యాంటీన్ పథకం తీసుకురావటం జరిగిందన్నారు.దానిలో భాగంగా 207 అన్నా క్యాంటీన్ లు ఏర్పాటు.చేసి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం,రాత్రి భోజనం కేవలం 5/-రూపాయలకే అందజేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.ఈ పథకం ద్వారా కార్మికులకు, విద్యార్ధులకు, అన్నార్తులకు, పేదలకు ఇలా అనేక వర్గాల వారికి చాలా ఉపయోగ పడుతుందన్నారు. ఇలాంటి బృహత్తర పథకాన్ని గత వైకాపా ప్రభుత్వం హయాంలో పక్కన పడేసి పేదల కడుపు కొట్టాడని మండిపడ్డారు. ప్రస్తుతం అన్నా క్యాంటీన్ నిర్వహణ వలన రాష్ట్ర వ్యాప్తంగా 200/-కోట్ల రూపాయల మేర ఖర్చు చేస్తున్నట్లుపేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రస్తుతంమరో 62 కొత్తగా అన్నా క్యాంటీన్లు నేడు ప్రారంభించటం జరుగు తుందన్నారు.మొత్తంగా 269 అన్నా క్యాంటీన్ లు రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.దీనిలో 8.80/-కోట్ల రూపాయల లబ్ధిదారులు దీనిని సద్వినియోగ పరుచు కుంటున్నట్లు తెలిపారు.ప్రస్తుతం రంపచోడవరం కేంద్రంగా నడుస్తున్న అన్నా క్యాంటీన్ నిర్వహణ బాధ్యులు కెల్ఎమ్ గురు ప్రసాద్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు.భవిష్యత్తులో అన్నా క్యాంటీన్ ల సంఖ్యను కూడా పెంచే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వర రావు,చిన్నం బాబూ రమేష్,రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు గొర్లె సునీత,రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సుభానీ,నియోజక వర్గ పార్టీ పరిశీలకులు వాడపల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్,జడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి,ఏపిఐఐసి డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు,మండల పార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్,పొత్తూరి కాంతారెడ్డి,జమాల్ ఖాన్,పల్లాల వెంకటరెడ్డి,గోళ్ల చంటి బాబు,గురుకు శేషు కుమార్,ఎడవల్లి భాస్కరరావు,బొర్రా నరేష్ కుమార్,జె.వెంకట రమణ రెడ్డి,సీతపల్లి గడి బాపనమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ కుంజం బాపన్నదొర,సభ్యులు సిద్ధా వెంకన్న దొర,ఏ.ఎమ్.సి వైస్ చైర్మన్ సలాది బాపిరాజు,తెదేపా బీసీ విభాగం నాయకులు ఎంపీటీసీ కరక వెంకట రమణ,గంగవరం సొసైటీ అధ్యక్షులు పాము అర్జున్,అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడబాల బాపిరాజు,ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు షేక్ చోటు,ఇబ్రహీం,క్లస్టర్ ఇంచార్జి కారం సింహాచలం,మాజీ మండల పార్టీ అధ్యక్షులు భీశెట్టి అప్పాజీ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కోసు నాగన్నదొర,నియోజక వర్గ ఎస్టీ విభాగం అధ్యక్షులు పండా చెల్లన్న దొర(బాబీ),రంపచోడవరం మాజీ సర్పంచ్ వై.నిరంజనీ దేవి,కనిగిరి సుభాష్,మహిళా విభాగ నాయకులు కంగల పోసమ్మ,గల్లా సత్యనారాయణ,బీజేపీ నాయకులు కారు లక్ష్మి,పెంటమ్మ,మాజీ మండల పార్టీ అధ్యక్షులు కారం సురేష్ బాబు,రంపచోడవరం వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ,తెదేపా సీనియర్ నాయకులు గణజాల తాతారావ్,రాజవొమ్మంగి మండలం పార్టీ ఉపాధ్యక్షులు జెట్టి మధు,అన్నా క్యాంటీన్ నిర్వాహకులు కెల్ఎన్ గురు ప్రసాద్,ఎమ్.పి.డి.ఓ ప్రసాద్,జెఇ విశ్వ మోహన్,వెలుగు డీపీఎమ్ డి.దుర్గా ప్రసాద్,ఏపీఎమ్ జి.శ్రీరాములు,మండల సమాఖ్య అధ్యక్షురాలు కె.గంగాభవాని అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *