చిన్నమండవలో అంగన్వాడీ కేంద్రంలో సీమంత వేడుకలు ఘనంగా నిర్వహణ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం చిన్నమండవ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు సీమంత వేడుకలు అంగర వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పర్చ రామచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, స్వీట్లు, చీరలు, గాజులు అందించి సాంప్రదాయబద్ధంగా సీమంత వేడుకలు జరిపారు. కార్యక్రమం కన్నుల పండువగా సాగి, గ్రామస్థులను ఆకట్టుకుంది. ఈ వేడుకలో ఉపసర్పంచ్ తంగిరాల మాధవి, వార్డు సభ్యులు గుండ్ల బేబీ రాణి, గుండ్ల భద్రమ్మ, పచ్చగాని వెంకటరములు, గుండ్ల అనిల్ కుమార్, పల్లె దవాఖాన డాక్టర్ అనిల్ కుమార్, ఏఎన్ఎం లలిత కుమారి, ఆశా వర్కర్లు బుచమ్మ, అరుణ, సీడీపీఓ చావా కమల ప్రియ, సూపర్వైజర్ పద్మవతి, అంగన్వాడీ టీచర్లు లింగం నిర్మల, నండ్రు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *