పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 13 సాలూర : రైతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్ అన్నారు. సాలూర మండల కేంద్రంలోని జాడి జమల్పూర్ గ్రామంలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ అంతయ్య, సంఘ కార్యదర్శి రామకృష్ణ, సాలూర మండల కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు దేవదానం, సీనియర్ నాయకుడు సుందర్ రాజు, వైట్ల శ్రీనివాసరావు, చిలకబాబు, నేపాల్ చిన్నయ్య, బలరాం, మజర్, కాట్రగడ్డ సంపత్, వి సంజయ్, ఆర్ బాలాజీ, ఎం శౌరి కౌటిల్య, అడికె రవి తదితరులు పాల్గొన్నారు.