
పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 దండేపల్లి దండేపల్లి మండలంలోని రెబ్బెనపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐ సి డిఎస్ సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ ప్రతి శిశువు జీవితంలో మొదటి వెయ్యి రోజులు ప్రాముఖ్యత గురించి, మెదడు అభివృద్ధి గురించి వివరించి చెప్పడం జరిగింది అలాగే స్థానికంగా దొరికే ఆకుకూరలు కూరగాయల లో ఉండే పోషక విలువల గురించి చెప్పడం జరిగింది షెడ్యూల్లో భాగంగా లబ్ధిదారులకు వంటల పోటీలు నిర్వహించి వాటిలో ఉండే పోషక విలువల గురించి వివరించి చెప్పడం జరిగింది. కిషోర్ బాలికలకి రక్తహీనత గురించి వాళ్ళు తీసుకునే ఆహారం గురించి వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెబ్బనపెల్లి వార్డు మెంబర్ కందుల అశోక్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు,స్కూల్ టీచర్స్ ,ఏ.ఎన్.ఎం .,గ్రామంలోని గ్రామ పెద్దలు తల్లిదండ్రులు , గర్భిణీ ,బాలింతలు,అంగన్వాడీ టీచర్ నర్సమ్మ, అంగన్వాడీ ఆయా తదితరులు పాల్గొన్నారు,,