రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం

పయనించే సూర్యుడు 20 ఏప్రిల్ 2026, భీంగల్ మండల్ ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణంలో శనివారం రోజున రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విరాట్ హిందు సమ్మేళనం నిర్వహించడం జరిగింది. భీంగల్ మండలంలోని పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో హిందువులు భారీ ఎత్తున ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇందూర్ జిల్లా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ శివ ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా తన అమూల్యమైన సందేశంతో హిందూ ప్రజలని ఉత్తేజితం చేశాడు. భీంగల్ పట్టణ వేద పండితులు నంబి పార్థసారథి మరియు నంబి వాసుదేవా చార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా డాక్టర్ బసంత్ రెడ్డి మరియు నీలవేణి పాల్గొన్నారు. హిందూ సమాజంపై మరియు భారతదేశ పై జరిగే దాడులను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమం అనంతరం వచ్చిన హిందూ బంధువులందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ స్వయం సేవకులు, సర్వసమాజ్ కమిటీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, భీంగల్ యోగ మిత్ర బృందం, విహెచ్పి మరియు బజరంగ్దళ్, గో సేవ కమిటీ సభ్యులు మరియు భీంగల్ మండల ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *