
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 20 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ తమ గ్రామానికి రక్షిత మంచినీరు అందించాలని డిమాండ్ చేస్తూ రంగంపేట మండలం జీ.దొంతమూరు శివారు బాలవరం గ్రామ మహిళలు, గ్రామస్తులు శనివారం రాత్రి రోడ్డుపై బైఠాయించి భారీ ఆందోళన చేపట్టారు. గత ఆరు నెలలుగా తాగునీటి ఎద్దడితో పాటు, కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ నీరే తాగునీరుగా.. గ్రామానికి సరఫరా అయ్యే మంచినీటి పైపులైన్ పక్కనే మురుగు కాలువ ఉండటం, అక్కడ పైపులైన్ వాల్వ్ పాడైపోవడంతో మురుగునీరు మంచినీటిలో కలిసిపోతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కలుషిత నీరు తాగడం వల్ల ఇప్పటికే గ్రామంలో చాలామంది వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పైపులైన్ మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు కోరినా పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ట్యాంక్ వాచర్ నిర్లక్ష్యం.. బూతు పురాణం నీరు కలుషితం అవుతుందని ప్రశ్నించిన స్థానికులను, మహిళలను పంచాయతీ ట్యాంక్ వాచర్ దుర్భాషలాడుతున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. “నీరు అలాగే వస్తుంది.. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి” అంటూ ఆయన బాధ్యతారాహిత్యంగా సమాధానం ఎమ్మెల్యే వివక్షపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహంగ్రామస్తుల ఆందోళనకు అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: రాజకీయ వివక్ష: గ్రామంలో సర్పంచ్ వైఎస్సార్‌సీపీకి చెందిన వారు కావడంతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బాలవరంపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. నిధులున్నా నిర్లక్ష్యం: పంచాయతీలో రూ.1.30 కోట్ల నిధులు ఉన్నప్పటికీ, కేవలం రూ.25 వేలు ఖర్చు చేస్తే తీరే సమస్యను పరిష్కరించకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం: కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు ఆగిపోయాయని, కలుషిత నీటి వల్ల ప్రజలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ట్యాంక్ వాచర్‌ను తొలగించే వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు.