
పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 20,తల్లాడ రిపోర్టర్ భట్రాజు సంఘం ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు సంఘ అభివృద్ధిని కాంక్షిస్తూ తల్లాడ మండలము మంగాపురం గ్రామం లోని శనివారం రామాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ఖమ్మం లో జరిగిన జిల్లా సంఘ ఎన్నికల్లో ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు మంగాపురం చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భట్రాజు సంఘ జిల్లా అధ్యక్షులు డాక్టర్ తోకచిచ్చు వెంకట పుల్లంరాజు దంపతులు ముందుగా స్వామివార్లకు పట్టు వస్త్రములు పూలదండలు సమర్పించారు. మంగాపురం గ్రామ పెద్దలు వీరికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా భట్రాజు సంఘ అధ్యక్షులు పుల్లంరాజు మాట్లాడుతూ గత మూడుతరాలుగా భట్రాజు కుటుంబాలకు మంగాపురం గ్రామం తో సంబంధాలు కలిగి ఉన్నామని వారి తాత , తండ్రి ఈ నేల పై పుట్టి ఈ నేల పై పెరిగారని తాను కూడా మంగాపురం గ్రామంలో చిన్న తనం లో ఆడుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. దాదాపు 100 సంవత్సరాల క్రితం 4 భట్రాజు కుటుంబాలు ఉండేవని ఆనాలుగు కుటుంబాల సంతతి నేడు జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడువందల కుటుంబాలుగా విస్తరించాయని జిల్లా భట్రాజు జనాభాలో డెబ్బై ఐదు శాతం మంగాపురం వారసులే అని అన్నారు. దేవాలయ నిర్మాణం, అభివృద్ధి లో కూడా భట్రాజులు ప్రధాన పాత్రపోషించారని గుర్తుచేశారు. గ్రామంలో పుట్టి పెరిగిన భట్రాజు బంధువులు అందరూ ఉన్నత స్థానంలో ఉన్నారని అదేవిధంగా నూతన కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో భట్రాజు సంఘం ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం కల్పించాలని మంగాపురం సీతా రామచంద్ర స్వామి కోరారు. గ్రామ సర్పంచ్ నాగ నరసింహారావు, గ్రామ పెద్దలు జిల్లా బట్రాజు సంఘం జిల్లా అధ్యక్షుడు తోక చిచ్చు పుల్లం రాజు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో రామాలయం కమిటీ గ్రామ సర్పంచ్ నాగ నరిసింహారావు, ఉపసర్పంచ్ చింటూ లు మరియు మంగాపురం గ్రామ పెద్దలు ప్రతిగడప రామకృష్ణం రాజు స్థానికులు నూతన కార్యవర్గ జిల్లా అధ్యక్షులు డా. తోకచిచ్చు వెంకటపుల్లంరాజు, కార్యదర్శి సరికొండ రవికిరణ్ రాజు, కోశాధికారి తంగెళ్ల వినోభారాజు , సహాయ కార్యదర్శిలు దేనువు కొండల రాజు, దుపాటి రంగరాజు, మహిళా సంఘం అధ్యక్షురాలు అంపాజ్వాల ఆరుణా దేవి , యువజన సంఘం కార్యదర్శి కోలాహలం రామరాజు తదితరులు పాల్గొన్నారు.