శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ .

పయనించే సూర్యుడు న్యూస్: ఏప్రిల్/20:నియోజకవర్గం స్టఫ్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోని ముస్కాన్ పేట గ్రామంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, పూజలు నిర్వహించడం జరిగింది.అర్చకులు పూజలు నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలు తో పాటు శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూరదేవరాజు ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి , పత్తికుంటపల్లె సర్పంచ్ జుట్టు శేఖర్ , యువజన కాంగ్రెస్ మానకొండూర్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ , మాజీ సర్పంచ్ చింతలపల్లి రవీందర్ రెడ్డి ,యువ నాయకులు తిప్పరపు వంశీ ,బోడ భూపతి రెడ్డి ,మల్ల రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *