పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 20 వాత్సవాయి గ్రామంలోని ఈరోజు న జగ్గయ్యపేట వాగ్దేవి జూనియర్ కళాశాలకు చెందిన వత్సవాయి విద్యార్థినులు విద్యలో విశేష ప్రతిభ కనబరిచారు. బైపీసీ విభాగంలో అమృత వర్ష 443 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్‌తో పాటు టౌన్ ఫస్ట్ సాధించగా, మమతా నాయుడు జూనియర్ ఇంటర్మీడియట్‌లో 487/500 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) మరియు మండల విద్యాశాఖ అధికారి నాగరాజు వారి ఆధ్వర్యంలో వత్సవాయి ప్రజా దర్బార్ కార్యక్రమంలో విద్యార్థినులను ఘనంగా సత్కరించారు. వారి ప్రతిభను గుర్తించి ఒక్కొక్కరికి రూ.10,000 నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బుస్సా సురేష్, విద్యార్థినుల తల్లిదండ్రులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.