పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 20 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న వ్యక్తిగత పరిశుభ్రత తోనే ఆరోగ్యం ముడిపడి ఉంటుందని కర్లపాటి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సామాజికవేత్త కర్లపాటి వెంకట శ్రీనివాసరావు అన్నారు. శనివారం అమరావతి సి ఆర్ డి ఏ పరిధిలో ఆర్ వి ఆర్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో పనిచేస్తున్న 85 మంది మహిళ కార్మికులకు పునర్వినియోగ శానిటరీ నాప్కిన్స్ ని ఆయన ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా ఆరోగ్యమే సమాజ ఆరోగ్యమని పేర్కొన్నారు గత నాలుగు సంవత్సరాలుగా నో ఫుడ్ వేస్ట్ బాల ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ ఉచిత సానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్లుగా తెలిపారు. కాక ఈ కార్యక్రమంలో ఆర్ వి ఆర్ మేనేజర్ చిన్ని ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలియజేయగా ట్రస్ట్ ట్రస్ట్ మేనేజర్ పి రాము పలువురు సిబ్బంది పాల్గొన్నారు.