డిసిసి ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత భద్రత ముప్పు…!

గన్ మెన్ లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న వైనం . తక్షణమే 1 + 1 గన్మెన్లను కేటాయించాలి. జిల్లా ఎస్పీ మరియు ఇంటెలిజెన్స్ వర్గాలకు కురుపాటి గణేష్ విజ్ఞప్తి

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 10 నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులు (డిసిసి)పున్న కైలాష్ నేతకు ప్రస్తుతం భద్రత పరంగా తీవ్ర ముప్పు పొంచి ఉందని, ఆయన రక్షణ దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు కురుపాటి గణేష్ జిల్లా ఎస్పీ, మరియు ఇంటెలిజెన్స్ వర్గాలను కోరారు.. గురువారం ఆయన చండూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు,భద్రత లేక తీవ్ర ఇబ్బందులు జిల్లాలో పార్టీ బలోపేతానికి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, పర్యటనలు చేస్తున్న పున్న కైలాష్ నేత కనీస భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని గణేష్ పేర్కొన్నారు.. క్షేత్రస్థాయిలో పర్యటించే సమయంలో గన్ మెన్ లు లేకపోవడంతో ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు..అధికారులకు విన్నపం “జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల హోదాలో ఉన్న వ్యక్తికి రక్షణ కల్పించడంలో జాప్యం చేయడం తగదు..ఇంటెలిజెన్స్ వర్గాలు మరియు జిల్లా ఎస్పీ ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించాలి..ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకముందే అప్రమత్తమై, ఆయనకు తక్షణమే 1 + 1 గన్ మెన్లను కేటాయించాలి” అని కురుపాటి గణేష్ కోరారు..ప్రభుత్వానికి విజ్ఞప్తి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ, ప్రజా సమస్యల పోరాటంలో ముందున్న కైలాష్ నేత భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని,ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో హోం శాఖ మరియు పోలీస్ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *