వంట గ్యాస్ కోసం రోజుల నిరీక్షణ

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 10 ఇంటి వంట గ్యాస్ కోసం లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాడికిలో ఇండెన్ గ్యాస్ గోదాము ఉండగా, భారత్ గ్యాస్ గోదాము గుత్తి లో ఉంది. దింతో అధిక సంఖ్యలో భారత్ గ్యాస్ సిలిండర్ల కై ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజుల ఒకసారి, లేదంటే ఇష్టానుసారంగా పంపిణీ జరుగుతోంది. దీనికి తోడు గ్యాస్ డెలివరీ అయినట్లు మెసేజ్లు వచ్చాయని, ఇక్కడకు వస్తే ఇంకా రాలేదని చెబుతున్నారని పలువురు మహిళలు వాపోతున్నారు. గత నెల 28న బుక్ చేస్తే ఇంకా రాలేదనడం బాగాలేదని, రెవెన్యూ అధికారులకు చెప్పనున్నట్లు ఈటె ప్రసాద్ పేర్కొన్నారు. దీనికి తోడు గుత్తి నుంచి యాడికి చేరే లోపల మధ్యలోనే పదుల సంఖ్యలో సిలిండర్లను అధిక ధరలకు దుకాణ, వ్యాపార వర్గాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి రోజు రెండొందల సిలిండర్ల రవాణా చేయాల్సిన చోట వారంలో కేవలం రెండు సార్లు 50 సిలిండర్ల తెచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేరితిలో కొనసాగితే రెవిన్యూ కార్యాలయం వద్ద ఆందోళనలు చేస్తామని ప్రజలు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *