పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 11.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ) సభ్యులకు సన్మాన 0 కార్యక్రమం జరిగినది. వైయస్సార్సీపి రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు మండలం ఎస్టీ సెల్ అధ్యక్షునిగా బి వాసు నాయక్ మరియు ప్రధాన కార్యదర్శిగా శీనా నాయక్,నాగరాజు నాయక్, మరియు కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్లు దాదాపు 20 మందిని నియమించడం జరిగినది, ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్ మరియు జిల్లా కార్యదర్శి శ్రీరాములు నాయక్ నూతనంగా ఎన్నుకున్నబడిన కమిటీ సభ్యులను సన్మానించడం జరిగినది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని, కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని, గిరిజన యువతకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో డాక్టర్ మునీంద్ర నాయక్, శ్రీరాములు నాయక్, మాజీ సర్పంచులు శ్రీనివాసులు నాయక్,రామయ్య,దేవమ్మ,నానికమ్మా, వెంకటరమణ నాయక్, యూత్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ నాయక్, వేణు నాయక్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చిన్న రాయలు, వెంకటస్వామి,పవన్, చంద్ర, పెద్ద రెడ్డప్ప, శంకర్ నాయక్, బాలాజి నాయక్, శివ శంకర్ నాయక్ దొరస్వామి నాయక్, సాయికృష్ణ నాయక్, తదితరులు పాల్గొన్నారు