భక్తులకు అన్నప్రసాదం పంపిణీ

పయనించే సూర్యుడు-12-04-2026-రాజంపేట న్యూస్ :నారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నారాయణ రాజుపేట గ్రామంలో సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం గ్రామ పరిధిలోని సీతారాముల ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ వేడుకల్లో గ్రామస్తులతో పాటు మాజీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నాయన పల్లి వెంకటసుబ్బయ్య, శశి కుమార్, కానకుర్తి వెంకటయ్య, సిరిసల నాగేంద్ర, మస్తాన్ రాయల్, ఉమ్మాది శివకుమార్, ఎముక దుర్గయ్య, బద్రి, రమేష్, శ్రీనివాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *