చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జ్యోతిరావు పూలే జయంతి.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఏప్రిల్.12.2026 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రముఖ సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే 200 వ జయంతిని శనివారం నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపల్ డా.కె.రత్న మాణిక్యం, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు తొలుత జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమా లలను వేసి నివాళులర్పించారు.ప్రిన్సిపల్ మాట్లాడుతూ…1827 సంవత్సరంలో,సత్తార్ జిల్లా మహారాష్ట్రలో జన్మించిన పూలే అంటరానితనం,కుల వివక్షత పైన, బాలికల విద్య కొరకు ఎంతగానో కృషి చేశారన్నారు.సావిత్రిబాయి పూలేను వివాహం చేసుకుని భారత దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దారన్నారు.1872 సంవత్సరంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి”సత్యశోధక్ సమాజ్”ను స్థాపించారన్నారు. ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ వై.పద్మ మాట్లాడుతూ…వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన సంఘసంస్కర్త పూలే అని,ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని మహిళా విద్య కోసం ఎంతగానో కృషి చేశారన్నారు.తెలుగు అధ్యాపకురాలు కే.లక్ష్మీ ప్రసన్న కుమారి మాట్లాడుతూ…సమాజంలో అందరికీ సమాన హక్కులు దక్కే వరకు నిజమైన స్వాతంత్రం సిద్ధించదని మహాత్మా పూలే దృఢంగా విశ్వసించారన్నారు.1848 సంవత్సరంలో భారత దేశంలోనే మొదటి బాలికల పాఠశాలను పూణేలో స్థాపించారన్నారు.పూలే అస్తమయం తర్వాత ఆయన ఆశయాలను అతని భార్య సావిత్రిబాయి ముందుకు తీసుకెళ్లారన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *