పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 14 : పిల్లలు, మహిళలకు ఆరోగ్యకరమైన పోషకాహారం అందించడమే పోషణ్ అభియాన్ లక్ష్యమని పడమటితాళ్ల కోటయ్య గూడెం సర్పంచ్ గాలెంక రాంబాబు అన్నారు. పోషణ్ పక్వాడలో భాగంగా సోమవారం కోటయ్య గూడెం గ్రామంలో అంగన్‌వాడీ టీచర్లు ,ఆశా వర్కర్లు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తుందని, పేదలకు వరం పోషణ్ అభియాన్ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోషణ్ అభియాన్ పథకం చిన్నపిల్లలు, గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులలో పౌష్టికాహార లోపాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం 2018లో ప్రారంభించిన ప్రధాన పథకం. దీని ముఖ్య ఉద్దేశం కురచతనం పోషకాహార లోపం, రక్తహీనతను తగ్గించడం మరియు జన్ భాగీదారీ (ప్రజా భాగస్వామ్యం) ద్వారా ఆరోగ్యకరమైన ‘సుపోషిత్ భారత్’ (పోషణతో కూడిన భారత్)ను నిర్మించడం అని చెప్పారు. పేదలకు వరం పోషణ్ అభియాన్ అని, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాలలో బలమైన పౌష్టికా హారం అందిస్తున్నామని సర్పంచ్ గాలెంక రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణుల కోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందజే స్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు , ఆశా వర్కర్లు , గర్భిణీ స్త్రీలు , చిన్నపిల్లలు ,మహిళలు పాల్గొన్నారు.