అన్నారుగూడెంలో రోడ్డు భద్రత వారోత్సవాలపై కార్యక్రమం

* బాధ్యతే భద్రతకు ప్రధాన సూత్రం.. * సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ మనోభావం

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 14 ,తల్లాడ రిపోర్టర్ రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా తల్లాడ పోలీస్ శాఖ అన్నారుగూడెం పంచాయతీ కార్యాలయంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంకు అన్నారుగూడెం సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ హాజరై ఆయన మాట్లాడారు.ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగిననాడే భద్రత దొరుకుతుందని.ప్రస్తుత తరుణంలో స్పీడుగా ఉన్న ఈ యుగంలో ప్రతి ఒక్కరూ పనిని త్వరగా ముగించుకోవాలన్న ఆలోచనలతో తొందరపడుతూ ప్రధమంగా మనం నిర్వహించవలసిన బాధ్యత మర్చిపోతున్నామని ఎప్పుడైతే మనం బాధ్యతను గౌరవిస్తామో భద్రతా కూడా అదే క్రమంలో దొరుకుతుందని.ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.ప్రధమంగా రోడ్డు భద్రత వారోత్సవాల ప్రతిజ్ఞ చేశారు.ఈ క్రమంలో మా యొక్క బాధ్యతను గుర్తెరిగి భద్రతతో ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం పోలీస్ శాఖ వారు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, పోలీస్ శాఖ, వార్డ్ మెంబర్స్, ప్రజా ప్రతినిధు లు, నాయకులు, మోటార్ ఫీల్డ్ యజమానులు, వివిధ ట్రేడ్ యూనియన్ల నాయకులు, పంచాయతీ సిబ్బంది, యువకులు తదితరులు అధికంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *