సమగ్ర సంపూర్ణ గ్రామాభివృద్దే గురి

* సర్పంచ్ ఆదేశానుశారం మల్టీటాస్క్ పనులతో బిజీగా ఉన్న సిబ్బంది.. * సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ వెల్లడి * గ్రామంలో అభివృద్ధి పనుల గుర్తింపుకై వార్డు సభలు,గ్రూప్ చర్చలు ముమ్మరం.. * చర్చల్లో చిన్నా,పెద్ద తేడా లేకుండా భాగస్వాములవ్వాలని సర్పంచ్ పిలుపు

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 14 ,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు,మరియు పాలక వర్గం సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేశారు.గత ఐదు సంవత్సరాలుగా గ్రామం అభివృద్ధిలో కుంటుపడింది. ఆ పరిస్థితి నుంచి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు ఆయన కృత నిశ్చయంతో పని చేయడానికి సంకల్పించారు.అందులో భాగంగానే అన్ని రంగాలలో అనగా విద్యుత్,పారిశుద్ధ్యం, తాగునీటి.తదితర మౌలిక సదుపాయాల కోసం ఆయన ప్రత్యేకంగా ఆయా వార్డుల్లో వార్డు సభలు,గ్రూప్ చర్చలతో వినూత్నంగా ప్రజల్లోకి వెళ్తున్నారు.అందులో భాగంగానే అన్నారుగూడెం గ్రామంలో పలుచోట్ల పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకు,మౌలిక వసుతుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. బీసీ కాలనీలో : ముత్యాలమ్మ గుడి సెంటర్ నందు చేతి పంపును రిపేర్ చేయించారు వాటికి కావాల్సిన సామాగ్రిని సమకూర్చి ఎప్పటినుండో మూలన పడి ఉన్న చేతి పంపను రిపేర్ చేయించారు. అదేవిధంగా ఎస్సీ కాలనీలో గొడ్ల యేసు ఇంటి దగ్గర ఉన్న చేతి పంపును కూడా రిపేర్ చేయించి తాగునీటిని అందజేస్తున్నారు.ఇటువంటి మౌలిక వసతుల ఏర్పాటు చేయడమే కాకుండా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ఆయన ఒక నూతన విధానాన్ని తీసు కొచ్చేందుకు ఈ క్రమంలో రానున్న రోజుల్లో ప్రతి వార్డులో కూడా వార్డు సభలు,గ్రూప్ చర్చలు అభివృద్ధి కోసం జరిగేలా చర్యలు తీసుకోవాలని సెక్రటరీకి ఆయన ఆదేశించారు.సర్పంచ్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా గ్రామం సమగ్రాబివృద్ధి చెందాలంటే ఒక వినూత్నమైన విధి విధానాలతో సిబ్బంది గ్రామ ప్రజల సహకారంతో, ప్రజా ప్రతినిధుల అండదండలతో గ్రామాభివృద్ధికై ప్రతి ఒక్కరూ పరస్పర సహకారం అందజేసి సహకరించాలని ప్రజలను, ప్రజాప్రతినిధులను, నాయకులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాలన విభాగంలో అపార అనుభవం కలిగిన నాయకులు మరియు ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు, గ్రామ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, గుమస్తా రమేష్,పంచాయితీ మల్టీపర్పస్ వర్కర్స్,స్థానికులు గోవిందు నాగేశ్వరరావు, ఇస్నపల్లి శ్రీనివాసరావు, ఇనపనూరి దాసు,గొడ్ల మోషే,సురేష్,ఇస్నపల్లి దిలీప్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *