పయనించే సూర్యుడు. మేజర్ న్యూస్ ఏప్రిల్ 14.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ) ఇటీవల అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నాయకులను ఉద్దేశించి అత్యంత దారుణమైన మరియు హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేశారు. వారిని చంపండి 2026 ఏప్రిల్ 6 సోమవారం. ప్రాంతం: అస్సాం, శ్రీభూమి జిల్లా. వివరణ: ” ఖర్గే వారికి మతపరమైన అంశాలను (నమాజ్, ఖురాన్) ప్రస్తావిస్తూ, రాజకీయ ప్రత్యర్థులను (బీజేపీ, ఆర్ఎస్ఎస్ ‘విషనాగులు’ అని సంబోధించి, వారిని ‘చంపాలి’ అని అనడం సమాజంలో మత విద్వేషాలను రేకెత్తించడమే కాకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉంది. ఇప్పటికే అస్సాం మరియు కర్ణాటక రాష్ట్రాల్లో వీరిపై కేసులు నమోదైన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అనే అర్థం వచ్చేలా వారు మాట్లాడటం సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది మరియు ఇది నేరుగా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ఉంది. రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, అల్లర్లను ప్రోత్సహించే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము . కావున, శాంతిభద్రతల దృష్ట్యా మరియు రాజకీయ హింసను అరికట్టేందుకు, మల్లికార్జున ఖర్గే వారిని తక్షణమే విచారణ జరిపి, చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము