రోడ్డు ప్రమాదంలో సీపీఐ మండల కార్యదర్శి ఓర్సు రమేష్ దుర్మరణం..

సంతాపం తెలిపిన వివిధ పార్టీల నాయకులు..

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 16 ,తల్లాడ రిపోర్టర్ సీపీఐ తల్లాడ మండల కార్యదర్శి ఓర్సు రమేష్ (48) బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తల్లాడలోని తన ఇంటి వద్ద నుండి మామిడితోట పనుల నిమిత్తం నరసింహారావుపేట ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఆ గ్రామంలో ప్రధాన రహదారి పక్కన ఆగి ఉన్న ఆయనను వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్ కొద్ది దూరంలో పడిపోవడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాగర్లమూడి రంజిత్ కుమార్, తాటి వెంకటేశ్వరావు, దండు అదినారాయణ, తోట రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యులు నిమ్మటురి రామకృష్ణ, ఎబు, యామల గోపాలరావు, తమ్మిసెట్టి వెంకటేశ్వర్లు, రాంబాబు ఆయన పార్దేవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అదేవిధంగా తల్లాడ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు, షేక్ ఈసు చల్ల నాగులు సరికొండ శ్రీనివాసరాజు గుంటుపల్లి వెంకటయ్య రాయల నరసింహారావు తమ్మిశెట్టి నరసింహారావు, గోపాల్ రెడ్డి, అనుమోలు సర్వేశ్వరరావు, నరసింహారావు తదితరులు నివాళులు అర్పించారు. తొలుత తల్లాడ పట్టణంలో భారీ ర్యాలీతో కన్నీటి వీడ్కోలు పలికారు. జిల్లాలోని వివిధ పార్టీల నాయకులు హాజరై ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. ప్రైవేట్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ సభ్యుడుగా ఉండటంతో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *