కార్మికులకు తలపాగాలు పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి-20 భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి తమ సొంత ఖర్చులతో తలపాగాలు (టవల్స్) పంపిణీ చేశారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ఎండలో పనిచేస్తున్నప్పుడు కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పనివేళల్లో మార్పులు చేసుకొని సూచించారు. నెత్తికి తలపాగా, టోపీ, ధరించాలని, చల్లని నీరు లేదా మజ్జిగ త్రాగాలని ఎండ వేడికి వడదెబ్బ తగలకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బైరి శంకర్, ఎస్.కె షరీఫ్, వెంగళ రాములు, కాల్వ కొమురయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *