కాంగ్రెస్ నమ్మిన బంటు జల్లిపల్లి దేవరాజుకు కో-ఆప్షన్ అవకాశం దక్కేనా?

* ​30 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన నికార్సైన కార్యకర్త! * అధిష్టానం వైపు ఆశగా ఎదురుచూస్తున్న శ్రేణులు.

​పయనించేసూర్యుడు న్యూస్ ఏప్రిల్ 20 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపల్ పాలకవర్గంలో ఖాళీగా ఉన్న నాలుగు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఈ నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నికార్సైన కార్యకర్తలకు ఈసారి అవకాశం కల్పించాలని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా కోరుతున్నాయి. ఈ రేసులో ప్రధానంగా 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా జెండా వీడని జల్లిపల్లి దేవరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ​ముప్పై ఏళ్ల ప్రస్థానం, పార్టీయే ఊపిరిగా ​జల్లిపల్లి దేవరాజు గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, అధిష్టానం ఇచ్చిన ప్రతి పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన ముందున్నారు. గతంలో మండల ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని స్వయంగా 150 మందికి పైగా కొత్త సభ్యులను చేర్పించి తన నిబద్ధతను చాటుకున్నారు. ​ఎన్నికల వ్యూహకర్తగా ​గత మున్సిపల్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం దేవరాజు అహర్నిశలు శ్రమించారు. ముఖ్యంగా 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గెలుపు కోసం ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టి విజయతీరాలకు చేర్చారు. అలాగే 19వ వార్డులో కూడా పార్టీ అభ్యర్థుల విజయం కోసం క్షేత్రస్థాయిలో పనిచేసి తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు. ​సేవా రంగంలో అగ్రగామి ​రాజకీయాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో దేవరాజుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత 16 ఏళ్లుగా ఆర్యవైశ్య సంఘంలో మండల కార్యదర్శి, వైస్ ప్రెసిడెంట్, కోశాధికారి, సహాయ కార్యదర్శిగా వివిధ హోదాల్లో సేవలందించారు. జిల్లా ఆర్యవైశ్య యూత్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహించి యువతను ఏకం చేశారు. వాసవి క్లబ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అనుభవంతో పాటు, ప్రస్తుతం జోన్ చైర్మన్‌గా ఉన్నత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ​అధిష్టానం గుర్తిస్తుందా? ​నిబద్ధత కలిగిన కార్యకర్తలకు గుర్తింపునిచ్చే కాంగ్రెస్ పార్టీ, అశ్వారావుపేట మున్సిపాలిటీలో జల్లిపల్లి దేవరాజు వంటి సీనియర్ నాయకుడికి కో-ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని సర్వత్రా విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల ఉన్న విధేయత, సుదీర్ఘ అనుభవం ఆయనకు ఈ పదవి దక్కేలా చేస్తాయని అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నికార్సైన కార్యకర్తకు పదవి దక్కితే భవిష్యత్తులో పార్టీ మరింత బలోపేతం అవుతుందని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *