పయనించే సూర్యుడు ఏప్రిల్ 20 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ పెద్ద తుంబలం, ఎం.పి.పి పాఠశాల (టీజీఎల్వి)లో శనివారం నిర్వహించిన వార్షికోత్సవం, ఐదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానోపాధ్యాయురాలు షహనాజ్ భాను ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మెప్పించాయి. హిందూ మైథాలజీ ఆధారంగా రూపొందించిన నృత్య, నాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నాయి.
వీడ్కోలు సందర్భంగా ఐదో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులు భవిష్యత్‌పై మార్గనిర్దేశం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, సైన్స్ డే విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు.పాఠశాల కమిటీ వైస్ చైర్మన్, సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వేడుకలు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.