మంత్రిని కలిసిన అందోల్ ఫోటోగ్రాఫర్ యూనియన్

పయనించేసూర్యుడు. న్యూస్.20. ఎప్రిల్. పుల్కల్ మండల ప్రతినిధి పెద్దగొల్ల విజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా.అందోల్ నియోజకవర్గం.అందోల్ మండల ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రి ని కలిశారు. ఫొటో గ్రాఫర్ అసోసియేషన్ భవన నిర్మాణం/కార్యాలయం కొరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించవలసిందిగా మంత్రిని కోరినట్లు అందోల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. మేము ఆందోల్ నియోజకవర్గ కేంద్రం మరియు మండల పరిధిలోని ఫోటో మరియు వీడియో గ్రాఫర్లము. గత ఎన్నో ఏళ్లుగా మా ప్రాంతంలో జరిగే అన్ని రకాల సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు ప్రభుత్వ కార్యక్రమాలను మా కెమెరాల్లో బంధిస్తూ, సమాజానికి మరియు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా ఉంటూ వృత్తిపరమైన సేవలను అందిస్తున్నాము. ప్రస్తుతం మా ఆందోల్ మండల అసోసియేషన్లో సుమారు 250 మంది పై సభ్యులు వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. అయితే, మా వృత్తిపరమైన అంశాలపై చర్చించుకోవడానికి, సభ్యుల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడానికి, మరియు కొత్తగా వచ్చే యువతీ యువకులకు ఫోటోగ్రఫీ రంగంలో శిక్షణా తరగతులు నిర్వహించుకోవడానికి మాకు సొంతంగా ఒక కార్యాలయం లేదా సంఘ భవనం లేదు. దీనివల్ల సమావేశాలు నిర్వహించుకోవడానికి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కావున, పెద్దలైన మీరు దయతల్చి మా అసోసియేషన్ భవన నిర్మాణం కోసం తగిన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, మా వృత్తి కళాకారుల సంక్షేమానికి తోడ్పడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మీరు తీసుకునే ఈ నిర్ణయం 250 కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది.మా విన్నపాన్ని సానుకూలంగా స్పందించి అందోల్ లో ఫోటోగ్రాఫర్ యూనియన్ భవన నిర్మాణం త్వరలోనే స్థలం కేటాయించి చూస్తానని అన్నారు అని అధ్యక్షులు అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, కార్యదర్శి, యూనియన్ సబ్యులు ఆందోల్ మండల ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్, సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *