అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి..

* అంబేద్కర్ కమిటీ నాయకులు నారపోగు ప్రసాద్ బాబు,, * ఎంపీడీవో శ్రీధర్ రాజుకు వినతి పత్రం అందజేత..

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 11 ,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని శుక్రవారం ఎంపీడీవో శ్రీధర్ రాజుకు వినతిపత్రం అందించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇల్లు లేక ఎంతోమంది నిరుపేదలు జీవనం సాగిస్తున్నారని, వారిని గుర్తించి పారదర్శకంగా ఇళ్లను ఎంపిక చేయాలని విన్నవించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా సర్వే చేయాలన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు నిబంధనలు పెట్టారని, ఆ నిబంధనల మేరకు అర్హులైన వారికి ఇల్లు కేటాయించాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో నారపోగు ప్రసాద్, రేగళ్ల శ్రీనివాసరావు, కాంపాటి రవి, ఇశ్రాయేలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *