ఆదోని ఈ ఎస్ ఐ హాస్పిటల్ ను తరలించవద్దు సీఎంతో మాట్లాడుతా

ఎమ్మెల్సీ బీటీ నాయుడు

పయనించేసూర్యుడు న్యూస్ 11 ఆదోనిడివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి దాదాపు 30 వేల మంది కార్మికులకు వైద్యం అందజేసే ప్రభుత్వ కార్మిక వైద్య బీమా వ్యాధి నిర్ధారణ కేంద్రాలయాన్ని తరలించకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ బీటీ నాయుడు అన్నారు. శుక్రవారం ఈఎస్ఐ హాస్పిటల్ ను ఎమ్మెల్సీ సందర్శించారు. ఏసి హాస్పిటల్ సంబంధించి పూర్తి వివరాల కోసం ఈఎస్ఐ కార్పొరేషన్ రీజినల్ డైరెక్టర్ రామారావు, ఈఎస్ఐ స్టేట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్, కార్పొరేషన్ ఈఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ పాండే, కర్నూలు ఈఎస్ఐ బ్రాంచ్ మేనేజర్ దుర్గాప్రసాద్ టీం సభ్యులు ఈఎస్ఐ హాస్పిటల్ సందర్శించి పూర్తిస్థాయి వివరాలను ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు రావడం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఈఎస్ఐ ఆసుపత్రికి సందర్శించి అధికారులతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటి నాయుడు మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గం లో పేదలు, ప్రైవేటు, ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారని, దాదాపు 30 వేల మంది కార్మికులు ఈఎస్ఐ సభ్యత్వం కలిగి ఉన్నారని ఈఎస్ఐ ఆసుపత్రిని కాపాడి బాధ్యత నాపై ఉందని, ఉన్న పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుకి వివరించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రి వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన అధికారులతో ఎమ్మెల్సీ బీటీ నాయుడు కార్మికులకు ఎంతో అవసరమైన ఆసుపత్రిలో వైద్యుల కొరత, కావలసిన వైద్య సామాగ్రి పూర్తి వివరాలతో సీఎం చంద్రబాబును కలిసి వివరిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *