కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వ్యతిరేకంగా బిజెపి నేతలు నిరసనలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 20 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం లో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఎల్లాన శకుంతల, యువమోర్చా జిల్లా అధ్యక్షులు గాణాల కళ్యాణ్ ఆధ్వర్యంలో శుక్రవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కొరకు ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి కి వ్యతిరేకంగా అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్ వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ పాల్గొని మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇండి కూటమి సభ్యులు కావాలనే అడ్డుకున్నారని, ఇది కాంగ్రెస్ పార్టీ దేశం లోని మహిళలకు చేసిన పెద్ద ద్రోహం అని అభివర్ణించారు. వారికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదని, వారు మహిళా వ్యతిరేకులని వారు విమర్శించారు. ప్రతిపక్షాల వైఖరి పై దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మహిళలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సలాది వీరబాబు, జిల్లా అధికార ప్రతినిధి అరిగెల పుల్లయ్య నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కొండేటి జయలక్ష్మి, రాష్ట్ర యువమోర్చా నాయకులు పాలూరి జయప్రకాష్, మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు చిట్టూరి రాజేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షుడు చిలకమర్రి కస్తూరి, జిల్లా కార్యదర్శి మోకా ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *