చుక్కాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధికి విరాళం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 20మాచారెడ్డి రిపోర్టర్ ఓబుల్ రెడ్డి మాచారెడ్డి మండల చుక్కాపూర్ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అభివృద్ధి జై శ్రీమన్నారాయణ శ్రీ సామల శ్రీనివాస్ శ్రీమతి లలిత చిన్నమల్లారెడ్డి వాస్తవ్యులు దేవాలయం యొక్క అభివృద్ధి కార్యక్రమానికి వారి వంతు సహాయంగా 5016/- రూపాయలను విరాళంగా అందజేయడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామి వారి ఆశీస్సులు జై శ్రీమన్నారాయణ శ్రీ జిలకర నాగమణి కీర్తిశేషులు లక్ష్మీ నర్సయ్య మలేషియన్ టౌన్షిప్ రంగారెడ్డి (దోమకొండ) వాస్తవ్యులు దేవాలయం యొక్క అభివృద్ధి పనులను చూసి తన వంతు సహాయంగా 81000/- రూపాయలను విరాళంగా అందజేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు చేయాలని గ్రామ ప్రజలు ఈరోజు ఏకగ్రీవంగా సంకల్పం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ప్రాంగణంలో భవిష్యత్తులో ఒక విశాలమైన కళ్యాణమండపం , అలాగే దేవాలయ మండపం మరియు పరిసర ప్రాంతాన్ని ఆధునికంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా తీర్చిదిద్దాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తమ వంతు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మరియు కార్యవర్గ సభ్యులు, చైర్మన్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధిలో దేవాలయాల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధికి గ్రామ ప్రజలు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. చుక్కాపూర్ గ్రామంలోని సీనియర్ నాయకులు కార్యకర్తలు, సేవకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా పని చేస్తే శ్రీ లక్ష్మి నరసింహ స్వామి అభివృద్ధి చెందుతుందని, గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *