ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటించాలి

* సీఐ నాగరాజు రెడ్డి * ప్రత్యేక వాహన తనిఖీ లు నిర్వహించిన పోలీసులు * అవగాహన పెంపుదలకు కార్యాచరణ * భారీ గా నెంబర్ లేని వాహనాలు గుర్తింపు * అశ్వారావుపేట మండల రిపోర్టర్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 20 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేశంలో చట్టాలు రోజురోజుకీ కఠినతరం అవుతున్నా, వాటి అమలు విషయంలో “జీరో ఎన్ఫోర్స్మెంట్” పరిస్థితి నెలకొందని సీఐ నాగరాజు రెడ్డి అన్నారు. చట్టాలు పుస్తకాలకే పరిమితమవడం తెలిసిన వారు సైతం పాటించకపోవడం తోనే అమలు కాని పరిస్థితి ఏర్పడితే అది సమాజానికి ముప్పుగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీస్ శాఖ కార్యాచరణ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జీర్ణో ఎన్ఫోర్స్మెంట్ విధానం లో ప్రత్యేక వాహనాల తనిఖీ లు చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రతీ వాహనాన్ని నిలిపి తనిఖీ లు చేసారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపినా మద్యం సేవించి డ్రైవింగ్ చేసినా తగిన చర్యలు లేకపోవడం ప్రజల్లో చట్టాల పట్ల నిర్లక్ష్యాన్ని పెంచుతోంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం ఉంది కానీ అమలు లేదు అన్న భావన ప్రజల్లో బలపడుతోందన్నారు. చట్ట అమలు సంస్థలు కఠినంగా వ్యవహరించకపోతే చట్టాల ఉద్దేశం నెరవేరదని వారు వాహనదారులకు హెచ్చరించారు చట్టం పుస్తకాల్లో కాదు అమల్లో ఉంటేనే ప్రజలకు రక్షణ అని వారు స్పష్టం చేశారు. మొత్తం వందకు పైగా ద్విచక్ర ఇతర వాహనాలు తనిఖీ చేయగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు 50 గుర్తించామని హెల్మెట్ వాడని, త్రిబుల్ డ్రైవింగ్ వాహనదారులు కు కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.హెచ్.ఓ ఎస్ఐ యయాతి రాజు ఎస్ఐ అఖిల ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *